Telangana,hyderabad, జూన్ 28 -- హైదరాబాద్ లోని మహా న్యూస్ మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం శ్రేణులు దాడి చేశాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లను ధ్వంసం చేశారు. కార్యకర్తలు ఆఫీసులోకి ప్రవేశించి నిరసన తెలిపారు. ఈ పరిణామంతో ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు."హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెల...