Hyderabad,telangana, జూలై 9 -- హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. పరిస్థితి విషమించడంతో ఇవాళ ముగ్గురు మృతి చెందారు. నిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.

బాలానగర్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘ‌ట‌న అత్యంత బాధాకరమని మంత్రి జూపల్లి చెప్పారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. వారి ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నానని. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

"సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఎక్సైజ్, పోలీసు అధికారులు స్పందించి హుటాహుటిన వారిని ని...