భారతదేశం, అక్టోబర్ 29 -- జాతీయ రహదారి 44పై ప్యారడైజ్ జంక్షన్-డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మెుదలుకానున్న నేపథ్యంలో ఈ నెల 30.10.2025 నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. దాదాపు తొమ్మిది నెలల పాటు ట్రాఫిక్ పనులు నడవనున్నాయి. ఈ మేరకు అధికారులు ట్రాఫిక్ మళ్లింపు గురించి వివరాలు వెల్లడించారు.

సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుండి NH-44లోని డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను సులభతరం చేయడానికి అక్టోబర్ 30 నుండి దాదాపు తొమ్మిది నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్, బాలంరాయి మధ్య రెండు వైపులా మార్గాన్ని మూసివేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని సూచించారు.

బాలానగర్ వైపు నుండి పంజాగుట్ట/ట్యాంక్ బ...