భారతదేశం, డిసెంబర్ 10 -- కోకాపేట.. ఈ పేరు వింటే చాలు భూముల రికార్డు ధరలు వినిపిస్తుంటాయి.! గత కొంత కాలంలో ఇక్కడ హెచ్ఎండీఏ ఆధ్వర్వంలో నిర్వహిస్తున్న భూముల వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి. పాత వాటిని బ్రేక్ చేస్తూ. కొత్త రికార్డులు కూడా నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజాగా కోకాపేటలోని నియోపోలిస్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 15, 16లోని భూములకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ప్లాట్ నెంబర్ 15లోని ఎకరం భూమి ధర అత్యధికంగా 151 కోట్ల 25 లక్షలు పలికింది."ది కాస్కేడ్స్ నియోపోలిస్" డెవలపర్స్ ఈ భూమిని దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఈ సంవత్సరం జూన్‌లో "ది కాస్కేడ్స్ నియోపోలిస్" పేరిట రూ. 3169 కోట్ల వ్యయంతో విలాసవంతమైన నివాస ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఐదు 63 అంతస్తుల టవర్లు మరి...