భారతదేశం, జూలై 26 -- హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. ఇక ఇవాళ ఉదయం నుంచి వాన ఆగటం లేదు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. మధ్యలో భారీగా వర్షం పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దైపోయింది.

వర్షాలతో ఆఫీసులకు వెళ్లే సమయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు రోడ్లపై భారీగా వరద నిలిచిపోవటంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా ఇవాళ పలు ప్రాంతా్లోల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు...