భారతదేశం, ఏప్రిల్ 25 -- హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ రావుపై 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. ఎంఐఎం అభ్యర్థికి 63 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 25 ఓట్లు వచ్చాయి.

ఉదయం 8 గంటలకు మొదలైన హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌‌లో మొదలైన కాసేపట్లోనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నా 88ఓట్లు మాత్రమే పోలయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంటలోపే ఫలితాలు వెలువడ్డాయి. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉన్నాయి. ఎంఐఎం పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బీఆర్‌ఎస్ పార్టీ పోలింగ్‌కు దూరంగా ఉంది.

ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకట...