భారతదేశం, నవంబర్ 19 -- ఉప్పల్ నుంచి నారపల్లి వైపు రావాలంటే ఆ ప్రయాణం ఎంత నరకమో చాలా మందికి తెలుసు. వరంగల్ వైపు వెళ్లేవారు ఈ దారి ఎప్పుడు అయిపోతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంతలా రోడ్డు అధ్వాన్నంగా ఉంటుంది. ఈ దారిలో వెళ్తుంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయనేది నిజం. దీనిపై సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోల్స్ ఉన్నాయి. దారంతా గుంతలు, పైకి ఎగిరే దుమ్ముతో ఈ రూట్‌లో ప్రయాణించేందుకు భయపడుతుంటారు జనాలు.

అయితే తాజాగా ఈ రూట్లలో ఫ్లైఓవర్ వర్క్స్ కూడా కాస్త త్వరగా చేస్తున్నారు. ఉప్పల్ నుంచి కూడా కొంత దూరం రోడ్డు వేశారు. ఇప్పుడు ఈ రూట్ మీద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. ఉప్పల్ దారిలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మెుదలుపెట్టామని కోమటిరెడ్డి చెప్పారు. 5.5 కి.మీ గానూ 1.5 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైందన్నారు. మేడారం జాతర ...