భారతదేశం, జనవరి 21 -- ప్రపంచంలోనే తొలి బ్యూటీ -టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్​లో ప్రారంభించనుంది.

దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ -2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ-టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. దీంతో...