భారతదేశం, జనవరి 5 -- హైదరాబాద్‌లో పిల్లలను స్కూల్‌లో దింపి రావాలన్నా ట్రాఫిక్‌తో చిరాకు. అలా బయటకు వెళ్లి వద్దామనుకున్నా.. గంటలు గంటలు ట్రాఫిక్‌లోనే ఇరిటేషన్. దీంతో జనాలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. అందులో నుంచి వచ్చినదే 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్.

ఈ 15 మినిస్ట్ సిటీ కాన్సెప్ట్‌లో కేవలం 15 నిమిషాల దూరంలో కార్యాలయాలు, మార్కెట్లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్‌, స్కూళ్లు ఉంటాయి. ఇక్కడకు సైక్లింగ్ లేదా కాలి నడకన చేరుకుంటారు. ట్రాఫిక్‌లో కోల్పోయిన గంటల జీవితాన్ని ఈ కాన్సెప్ట్ ద్వారా సేవ్ చేసుకోవచ్చన్నమాట.

వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాల సవాళ్లతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు కస్టమర్లను ఆకర్శించేందుకు ఇలాంటి కొత్త రకం ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌లు గృహాలను కార్యాలయాలు, మార్కెట్లు, ఆరోగ్య ...