భారతదేశం, డిసెంబర్ 8 -- హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో విమానాల అంతరాయాలు సోమవారం కొనసాగాయి. 112 ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయి. రద్దులలో 58 రావాల్సినవి, 54 ఇక్కడి నుంచి వెళ్లాల్సినవరి ఉన్నాయి. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులపై మరింత ఒత్తిడిని ఇది పెంచుతుంది. ఇండిగో అంతరాయం ఆరో రోజుకు చేరుకోగా.. డిసెంబర్ 3 నుండి హైదరాబాద్ విమానాశ్రయంలో మొత్తం విమానాల రద్దు సంఖ్య 600 దాటింది.

ఇండిగో డిసెంబర్ 7న తన 138 గమ్యస్థానాలలో 137 గమ్యస్థానాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని పేర్కొంటూ స్టేటస్ అప్‌డేట్ జారీ చేసింది. డిసెంబర్ 6న 1,500 విమానాలతో పోలిస్తే 1,650 విమానాలను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. డిసెంబర్ 6న 30 శాతం నుండి డిసెంబర్ 7న దాని ఆన్-టైమ్ పనితీరు 75శాతానికి పెరిగిందని కూడా పేర్కొంది. డి...