భారతదేశం, మే 9 -- దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భాగ్యనగర పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఇప్పటికే భద్రత పెంచిన పోలీసులు.. అసాంఘిక శక్తులు, అక్రమ చొరబాటుదారుల కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, రోహింగ్యాలపై నిఘా పెట్టారు. వారు ఎక్కడెక్కడ ఉంటున్నారు..? ప్రస్తుతం ఏం చేస్తున్నారు..? అనే కోణంలో పోలీస్‌స్టేషన్ల వారీగా స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో జరిగే మిస్‌ వరల్డ్‌ పోటీలకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ జరుగుతున్న క్రమంలో.. అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పోటీల్లో భాగంగా ఈ నెల 13న చార్మినార్‌ దగ్గర హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించనన్నారు. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అటు...