భారతదేశం, నవంబర్ 24 -- తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా అధికారికంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది. హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్యకారక, ఔట్‌డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తారు.

ఈ హిల్ట్ పాలసీలో భాగంగా 22 ఇండస్ట్రీయల్ ఏరియాల్లోని 9,292 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా అవకాశం ఉంటుంది. ఈ భూముల్లో 4,740 ఎకరాలు ప్లాటెడ్ అంటే నిర్మాణాలు చేపట్టినవి. వన్-టైమ్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు (డీఐఎఫ్) చెల్లింపుల గురించి కూడా నోటీసులో తెలిపారు.

80 ఫీట్ల కంటే తక్కువ రోడ్లు ఉన్న ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలు...