భారతదేశం, నవంబర్ 27 -- సౌత్ సెంట్రల్ రైల్వే మరో కొత్త సర్వీస్‌ను ప్రవేశపెడుతోంది. ఇంటి నుంచే వినియోగదారులు పార్శిల్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిద్వారా చాలా రకాలుగా ప్రయోజనం పొందనున్నారు. ఈ పార్శిల్ లాజిస్టిక్స్ సర్వీస్‌ మెుదటగా హైదరాబాద్‌ డివిజన్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. రైలు ద్వారా తమ పార్శిల్ బుక్ చేయాలనుకునేవారికి ఇకపై ఈజీగా ఉండనుంది. ఫస్ట్ మైల్ అంటే వస్తువులను తీసుకోవడం, మిడ్ మైల్ అంటే రైలు ద్వారా రవాణా, లాస్ట్ మైల్ అనగా డెలివరీ.. కాన్సెప్ట్‌తో వస్తోంది రైల్వే శాఖ.

సేవలను అందించేందుకు ఈ జోన్ ఏజెన్సీలు, లాజిస్టిక్స్ భాగస్వాములను పికప్, డెలివరీ సేవలను అందించడానికి రైల్వే శాఖ ఆహ్వానించింది. ఇవి రైలు ద్వారా రవాణాతో కనెక్ట్ అవుతాయి. ప్రతిపాదిత రైల్ పార్శిల్ యాప్ వినియోగదారులను ఒకే ప్లాట్‌ఫామ్‌లో బుక్ చేసుకోవడానికి, ట...