భారతదేశం, మే 12 -- సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక ఏఐని ఉపయోగించి.. పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్ రంగంలో, లైఫ్ సైన్సెస్‌ రంగంలో.. ఇంకా అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారిందని వివరించారు. అలాగే ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని చెప్పారు.

'మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే.. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు.. రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ల...