భారతదేశం, జూన్ 19 -- హైదరాబాద్, జూన్ 19, 2025: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభమైంది. జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ.. ఈ మూడు దిగ్గజ సంస్థలు కలిసి "ది కాస్కేడ్స్ నియోపోలిస్" అనే మెగా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. అక్షరాలా రూ. 3169 కోట్లతో, 217 మీటర్ల ఎత్తులో, 63 అంతస్తుల 5 భారీ టవర్లతో ఇది హైదరాబాద్ స్కైలైన్‌కు సరికొత్త అందాన్ని తీసుకురానుంది. మార్చి 2030 నాటికి ప్రాజెక్ట్ పూర్తయి, మీ చేతికి తాళాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక కట్టడం కాదు.. ఇది సమకాలీన డిజైన్, పర్యావరణ స్నేహపూర్వక జీవనం, స్మార్ట్ హోమ్ టెక్నాలజీల అద్భుత సమ్మేళనం అని జాయింట్ వెంచర్ చెబుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు ప్రపంచ ప్రఖ్యాత వాస్తుశిల్పులు పనిచేశారు. UHA లండన్ ...