భారతదేశం, ఏప్రిల్ 18 -- బెట్టింగ్‌ యాప్‌లకు మరో యువకుడు బలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం తెలియక పోవడంతో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి బలి అయ్యాడు. హైదరాబాద్‌ మసాబ్‌ ట్యాంక్‌ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఎంటెక్‌ చదువుతున్న పవన్‌ అనే యువకుడు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బెట్టింగ్‌ యాప్‌ల దారుణాలకు మరో యువకుడు బలయ్యాడు. మోసపూరిత యాప్‌లను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటి వలలో చిక్కుకుని సర్వం పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఎంటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

గద్వాలకు చెందిన పెద్ద నర్సింహులు కుమారుడు పవన్ హైదరాబాద్‌లో జేఎన్‌టీయూలో ఎంటెక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అత్తాపూర్‌లోని ఓ గదిలో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా బెట్టింగ్‌ యాప్‌ల...