భారతదేశం, మే 5 -- హైదరాబాద్ మధురా నగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం సాయంత్రం 35 ఏళ్ల వ్యక్తి మృతిచెంది కనిపించాడు. మృతుడిని పవన్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని ప్రైవేట్ భాగాలపై గాయాలు కనిపించాయి. అతని పెంపుడు జంతువు సైబీరియన్ హస్కీ కూడా అదే గదిలో నోటి నుండి రక్తం కారుతున్నట్లు కనిపించింది. క్లూస్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడు, కుక్క నోటి నుండి రక్త నమూనాలను సేకరించాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం పరీక్ష, ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పవన్ ఒక ఆభరణాల వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. సందీప్ అనే వ్యక్తితో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం.. సందీప్ పనికి బయలుదేరాడు. పవన్ గదిలో ఉండగా.. కుక్క గదిలో వదిలి వెళ్లాడు. మ...