భారతదేశం, నవంబర్ 6 -- రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు మద్దతుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పరిశ్రమకు అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న చిత్ర పరిశ్రమ వల్ల రాష్ట్రానికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటును ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని భట్టి తెలిపారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు క్లబ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి సినీ పరిశ్రమ ప్రతినిధులు, సినీ కార్మికుల సంఘం నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు పరిశ్రమను తరలించినప్పుడు వేలాది మంది సినీ కార్మికుల జీవితాలు మెరుగుపడ్డాయని, స్టూడియోల నిర్మాణం కోసం ప్రభు...