భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్‌కు కొత్త కాన్సుల్ జనరల్‌గా లారా ఇ. విలియమ్స్ బాధ్యతలు స్వీకరించారు. ఆమె అత్యున్నత యూ.ఎస్. సీనియర్ ఫారిన్ సర్వీస్‌లో అనుభవజ్ఞురాలు, దౌత్యం, సాంకేతికత, ఆవిష్కరణలలో ఆమెకు విశేషమైన అనుభవం ఉంది.

కొత్త బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా లారా విలియమ్స్ మాట్లాడారు. "హైదరాబాద్‌లో యూ.ఎస్. కాన్సుల్ జనరల్‌గా పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో యూ.ఎస్.-ఇండియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సహకారం, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, తద్వారా మన ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు పెరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ గొప్ప ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం, ప్రజల తరపున సేవలందించడం, వారి విలువలని ప్రతిబింబించడం నాకు దక్కిన విశే...