భారతదేశం, జూలై 18 -- హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి.

పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయతనగర్‌, అబ్దుల్లా పూర్ మెట్ ఇబ్రహీంపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉప్పల్‌, బోడుప్పల్‌, మేడిపల్లిలో సైతం భారీ వర్షం పడింది.

భారీ వర్షం ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు...