భారతదేశం, నవంబర్ 26 -- మాదాపూర్‌లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకుంది . రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీని వెనుక సూత్రధారి స్వామి నాయుడు, అతని కుటుంబం పరారీలో ఉన్నారు.

NSN ఇన్ఫోటెక్ కంపెనీ గత కొన్ని నెలలుగా మాదాపూర్‌లోని ఒక భవనంలోని కార్యాలయం పెట్టుకుని పనిచేస్తోంది. ఇది 'ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ' వంటి అధిక డిమాండ్ ఉన్న కోర్సులలో శిక్షణ అందించింది. శిక్షణ తర్వాత తన కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి నిరుద్యోగి దగ్గర నుండి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రుసుము వసూలు చేసింది . ఈ వి...