భారతదేశం, మే 18 -- తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మన పోలీసులు. పక్కా ప్లానింగ్‌తో బ్లాస్ట్‌ చేద్దామనుకున్న విజయనగరానికి చెందిన సిరాజ్, సమీర్‌ అనే ఇద్దరు నిందితుల్ని.. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. సిరాజ్-సమీర్‌ కలసి హైదరాబాద్‌లో బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారని బయటపడింది. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సమీర్-సిరాజ్‌కు ఆదేశాలు ఇచ్చింది. బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ముప్పును తప్పించారు.

ఇప్పుడే కాదు.. గతంలోనూ హైదరాబా...