భారతదేశం, ఏప్రిల్ 20 -- హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లో దారుణం జరిగింది. కృష్ణ పావని అనే మహిళ.. నాలుగేళ్ల కూతురు జశ్వికకి పురుగుల మందును కూల్ డ్రింక్‌లో కలిపి తాగించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈనెల 18న సాయంత్రం ఈ ఘటన జరిగ్గా.. ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక ప్రాణం విడిచింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్ గాజులరామారంలో కూడా ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేష్‌ హెయిట్స్‌ అపార...