భారతదేశం, ఏప్రిల్ 17 -- మేడ్చల్‌ జిల్లా గాజుల రామారంలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో తల్లి కన్నబిడ్డలను హతమార్చి ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గాజుల రామారంకు చెందిన పదకొండేళ్ల రిషిత్ రెడ్డి, ఐదేళ్ల ఆశిష్‌ రెడ్డిలను కన్న తల్లి వేటకొడవలితో నరికి చంపి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలంలో పోలీసులు ఐదు పేజీల సూసైడ్ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు.

కుటుంబ కలహాలతో మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. పిల్లలు తల్లి చేతిలో హత్యకు గురి కావడం స్థానికులను కలిచివేసింది. బాలానగర్‌ డీసీపీ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....