భారతదేశం, సెప్టెంబర్ 7 -- హైదరాబాద్ నగరవాసులకు ఇక తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ తాగునీటి సరఫరాను బలోపేతం చేయడం, మూసీ నదిని పునరుద్ధరించడం లక్ష్యంగా రూ.8,858 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది.

రూ.7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి పథకం దశ 2, దశ 3 ప్రారంభించనున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీల నీటిని తీసుకుంటారు. ఇందులో 2.5 టీఎంసీలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీ పునరుజ్జీవనం కోసం కేటాయించనున్నారు. మిగిలిన 17.5 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయిస్తారు. ఈ మార్గంలో ఉన్న ఏడు చెరువులను కూడా నింపుతారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) మోడల్ కింద ఈ ప్రాజెక్ట్ రెండు సంవత్...