Telangana,hyderabad, జూన్ 18 -- హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ను ఇక్కడ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం ఎంతో మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాము. మన ఆర్థిక వ్యవస్థ.. మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే. మనం మరింత అభివృద్ధి చెందుతాము. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్ సెక...