భారతదేశం, డిసెంబర్ 8 -- రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిందితులు పక్కా ప్రణాళికతో చంపేశారు. హత్య జరిగిన తీరు భయంకరంగా ఉంది. మెుదట కత్తులతో పొడిచి.. ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ జవహర్ నగర్‌లో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను వెంబడించారు. 54 ఏళ్ల రియల్టర్ వెంటరత్నం తన స్కూటీ మీద ప్రయాణిస్తుండగా దుండగులు అతన్ని వెంటపడ్డారు. మెుదట కత్తితో అతడిపై దాడి చేశారు. తర్వాత తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో తుపాకీ శబ్ధానికి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడిపోయిన వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చె...