భారతదేశం, డిసెంబర్ 25 -- బిజీ బిజీగా సాగిపోయిన వారానికి వీడ్కోలు చెబుతూ, ఈ వీకెండ్‌ను గ్రాండ్‌గా ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. అక్షర ప్రియుల కోసం పుస్తక మేళా, చరిత్రను ప్రేమించే వారి కోసం సరికొత్త మ్యూజియం గ్యాలరీ, సంగీతం, నవ్వులు.. ఇలా ఒకటేమిటి, నగరవాసుల కోసం బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి. డిసెంబర్ 26 నుంచి 28 వరకు మీరు వెళ్లదగ్గ ప్రధాన ఈవెంట్స్ వివరాలు మీకోసం..

హైదరాబాద్ చరిత్రను, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సాలార్ జంగ్ కుటుంబానికి అంకితం చేస్తూ మ్యూజియంలో సరికొత్తగా 'ఫౌండర్స్ గ్యాలరీ'ని ప్రారంభించారు. సాలార్ జంగ్-1, 2, 3లకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు, అరుదైన చిత్రపటాలు ఇక్కడ కొలువుదీరాయి. ముఖ్యంగా జరీ పనితనంతో మెరిసిపోయే సింహాసనాలు, వెండి ఫర్నిచర్, అప్పట్లో వారు ధరించిన షేర్వానీలు, తలపాగాలను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఎ...