భారతదేశం, ఏప్రిల్ 24 -- హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులకు ఆధార్‌ కార్డులు సృష్టించే గుట్టును పోలీసులు చేధించారు. నార్సింగి మునిసిపాలిటీ ఉద్యోగి రూ.15వేలకు జనన ధ్రువపత్రం జారీ చేయడంతో వాటి సాయంతో ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌ పొందే ప్రయత్నం చేశారు. వీరి వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడంతో నార్సింగ్ మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ హసిబుల్ నాలుగేళ్ల క్రితం ఏజెంట్లకు రూ.25వేలు చెల్లించి డాంకీరూట్ ద్వారా దేశంలోకి ప్రవేశించాడు. కోల్‌కత్తా సౌతారాలో జోవన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు తయారు చేయించాడు. కొన్నాళ్లు కోల్‌కత్తాలో కరాటే శిక్షకుడిగా చేశాడు.

హసిబుల్‌కు 2023 డిసెంబరులో ఫేస్‌బుక్‌లో మలక్‌పేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. జోవన్‌ చౌదరిగా ఆమెతో ...