భారతదేశం, నవంబర్ 12 -- హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్ కోనుగొలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తొర్రూర్, బహదూర్‌‌‌‌‌‌‌‌పల్లి, కుర్మల్‌‌‌‌‌‌‌‌గూడ ప్రాంతాల్లో ఉన్న 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను వివరాలను ప్రకటించింది.

స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను నవంబర్ 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం ప్రకటించారు.

ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలోని తొర...