భారతదేశం, జూన్ 16 -- క్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన రాజపుష్ప ప్రాపర్టీస్.. నార్సింగిలో ప్రధాన నివాస సముదాయం రాజపుష్ప ప్రావిన్షియాలో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ క్లబ్ ఒడిస్సీని ఘనంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. 1,00,000 ప్లస్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న క్లబ్ ఒడిస్సీ.. నివాసితుల కోసం ఆరోగ్యం, ఫిట్‌నెస్, విశ్రాంతి, ఇతర సౌకర్యాలను అందించే కేంద్రంగా మారనుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా, రాజపుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గౌరవ అతిథిగా వచ్చారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్‌కి కొంత దూరంలో ఉన్న రాజపుష్ప ప్రావిన్షియా.. 23.75 ఎకరాల విస్తీర్ణంలో 3,498 ప్రీమియం అపార్ట్‌మెంట్లతో కూడిన మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ. మొదటి దశ (1,908 ...