భారతదేశం, డిసెంబర్ 1 -- హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన శాఖ జారీ చేసిన G.O.Ms.No.43 ప్రకారం, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సమర్పించిన ప్రతిపాదనను వివరణాత్మక పరిశీలన తర్వాత ఆమోదించారు.

ఇందులో భాగంగా నగరంలోని మెట్రో జోన్‌లో ఓవర్ హెడ్ లైన్లను పూర్తిగా తొలగించి అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లను కవర్ చేస్తుంది. TGSPDCL 33kV, 11kV, లో-టెన్షన్ (LT) నెట్‌వర్క్‌లతో సహా ఇప్పటికే ఉన్న 3,899 కి.మీ ఓవర్ హెడ్ (OH) లైన్‌లను భూగర్భ క...