భారతదేశం, డిసెంబర్ 7 -- హైదరాబాద్‌లో పలు రోడ్లు ప్రముఖుల పేర్లను పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రతిపాదించింది. ప్రపంచంలో ఓ రోడ్డుకు మెుదటిసారిగా ట్రంప్ పేరు పెట్టినట్టవుతుంది.

'ప్రపంచంలో ఇది మొదటిది, గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనుకుంటున్నాం. హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ వెంబడి ఉన్న హై ప్రొఫైల్ రహదారిని 'డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పిలవనున్నారు.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది.

'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ఒక రోజు ముందు ఈ ప్రకటన బయటకు వచ్చింది. రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రిం...