భారతదేశం, అక్టోబర్ 12 -- విశాఖ నగర పరిధి రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్‌లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్(Sify Infinit Spaces Limited) ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్.. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు. పెట్టుబడులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు.

'సూపర్ సిక్స్‌లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం మా లక్ష్యం. అయితే ఐటీ మంత్ర...