భారతదేశం, ఏప్రిల్ 19 -- హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతోంది. ఈసీఐఎల్, కాప్రా, యాప్రాల్, అల్వాల్, నాగారం, దమ్మాయిగూడ, శామీర్‌పేట, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నార్త్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 18న సాయంత్రం కురిసిన ఈ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, నానక్‌రామ్ గూడ, కోకాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు కూడా వీచడంతో కొన్నిచోట్ల రేకుల షెడ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

టోలీచౌకి, షేక్ పేట, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగ...