భారతదేశం, అక్టోబర్ 6 -- దసరా సెలవుల తర్వాత వేలాది మంది తమ స్వస్థలాల నుండి హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చే రహదారులపై తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఆదివారం మాత్రమే ఉంటుందని అనుకున్నారు చాలా మంది. కానీ సోమవారం కూడా చాలా మంది ఊర్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఇటు విజయవాడ-హైదరాబాద్, అటు వరంగల్-హైదరాబాద్, ఇంకోవైపు కరీంనగర్-హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో రద్దీ నెలకొంది.

సోమవారం పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడంతో రద్దీ నెలకొంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. చౌటుప్పల్‌లో వాహనాలు అనేక కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఆదివారం అయితే తెల్లవారుజామున ప్రారంభమైన రద్దీ అర్ధరాత్రి దాటినా కొనసాగింది, హైదరాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ అత్యంత తీవ్ర జామ్‌ ఉంది.

ట్రాఫిక్‌ను సులభతరం ...