భారతదేశం, డిసెంబర్ 16 -- తెలంగాణ విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన విద్యా సంస్థలు, పెండింగ్‌లో ఉన్న నిధులపై సుదీర్ఘంగా చర్చించారు.

భారతదేశంలో సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో హైదరాబాద్ నగరం శరవేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నగరానికి ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) అత్యవసరమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం వివరించారు.

దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఒక మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. "ఐఐఎం ఏర్పాటుకు కావాల్స...