భారతదేశం, జూలై 31 -- దేశంలో వైద్యంతో పాటు విద్యకు సంబంధించిన ఖర్చులు ప్రతియేటా భారీగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు "చదువు" కూడా రానురాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అనేక విద్యా సంస్థలు చిన్న చిన్న తరగతుల నుంచే భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇందుకు ఊదాహరణగా, సోషల్​ మీడియాలో తాజాగా ఒక ట్వీట్​ వైరల్​గా మారింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల వివరాలతో కూడిన ఫొటో అందులో ఉంది. ఆ ఫోటోలో నర్సరీ వార్షిక ఫీజు రూ. 2,51,000గా పేర్కొనడంతో విద్యా ఖర్చులపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ధరమ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకురాలు అనురాధా తివారీ ఎక్స్​లో ఈ ఫీజుల పట్టికను షేర్ చేస్తూ.. భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు విద్య, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు.

"ఇప్పుడు ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెలకు రూ. 21,000 ఖర్చవుతుంది. ఇంత ...