భారతదేశం, నవంబర్ 18 -- పిస్తా హౌస్‌, షాగౌస్‌ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పిస్తా హౌస్ షాగౌస్ హోటల్లో యజమానుల ఇళ్లలో ఉదయమే తనిఖీలు మెుదలుపెట్టింది ఆదాయపు పన్ను శాఖ. పిస్తా హౌస్, షాగౌస్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. రికార్డుల్లో చూపిన ఆదాయం నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు.

ఈ హోటళ్ల ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. వీరికి సంబంధించి హావాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. మొత్తం నాలుగు టీమ్స్ ‌గా ఏర్పడి సోదాలు చేస్తున్నారు.

Published by ...