Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొట్టింది. ఇన్నర్ సిటీ కాకుండా. నగర శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

భారీ వర్షానికి విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వరద నీరు ఏరులై పారుతోంది. మోకాలి లోతు నీరు ప్రవహిస్తుండగా. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హయత్‌నగర్‌ నుంచి సిటీవైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్న పరిస్థితులు ఉన్నాయి.

ఇక ఇవాళ మెదక్, భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చే...