భారతదేశం, డిసెంబర్ 25 -- పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కూ రాష్ట్ర ప్రభుత్వం ప‌తంగుల పండ‌గ నిర్వహించ‌డం ఆన‌వాయితీగా ఉంది. ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కూడా కైట్ పెస్టివల్ నిర్వహించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. త‌మ్మిడికుంట‌, కూక‌ట్‌ప‌ల్లిలోని న‌ల్ల చెరువుల‌ను సంద‌ర్శించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

చెరువుల‌లోకి నేరుగా మురుగు నీరు చేర‌కుండా ఎస్‌టీపీ(సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు)ల ద్వారా శుద్ధి జ‌లాలు వ‌చ్చేలా ఏర్పాటు వెంట‌నే చేప‌ట్టాల‌ని హైడ్రా రంగనాథ్ సూచించారు. ఎస్‌టీపీల‌ను ఏర్పాటుచేసిన ప్రాంతంలో ప‌రిశుభ్రమైన వాతావ‌ర‌ణం ఉండేలా చూడాల‌...