భారతదేశం, ఏప్రిల్ 23 -- హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇకపై కొత్త లోగోతో కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటి వరకూ ఈవీడీఎం లోగోతోనే పనిచేసిన హైడ్రా లోగో మార్చింది. హైదరాబాద్ నగరాన్ని సూచించేలా హెచ్ అక్షరంపై నీటి బొట్టు ఉన్న లోగోను రూపొందించారు. చెరవులను కాపాడుకుంటూ, జల సంరక్షణ చేపడుతూ హైదరాబాద్ ను విపత్తుల నుంచి రక్షించుకుందామనే సూచకంగా కొత్త లోగోను తీర్చిదిద్దారు.

కొత్త లోగోను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారికంగా ఆమోదించారు. హైడ్రా కార్యకలాపాలు, సిబ్బంది యూనిఫామ్, వాహనాలపై నూతన లోగోను ముద్రించనున్నారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కొత్త లోగోను అప్డేట్‌ చేశారు.

వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. బ...