భారతదేశం, ఏప్రిల్ 19 -- హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కట్టడాలను కూల్చివేసింది. హఫీజ్ పేటలో ఉన్న 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అందులో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన ఆఫీసు సైతం ఉంది. ఈ 17 ఎకరాల విలువ రెండు వేల కోట్లకుపైగా ఉటుందని అంచనా. ఈ భూమిలో షెడ్లను నిర్మించారు. వీటిలో సినిమా షూటింగ్‌లకు సంబంధించిన పరికరాలను ఉంచారు. ఈ షెడ్లను హైడ్రా అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు.

హైడ్రా కూల్చివేతలపై టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. హైడ్రా న్యాయబద్ధంగా కూల్చివేస్తే వారాంతాల్లోనే ఎందుకు కూలుస్తున్నారని మండిపడ్డారు.

"నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో న్యాయవ్యవస్థ క్రియాశీలకంగానే ఉంది. ...