Telangana,hyderabad,delhi, జూలై 31 -- రాష్ట్రంలోని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసింది. హైకోర్టులో మొదలైన విచారణపర్వం.. చివరగా సుప్రీంకోర్టు వరకు వచ్చింది. ఇరుపక్షాలతో పాటు తెలంగాణ స్పీకర్ తరపున సుదీర్ఘ వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. 3 నెలలలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో. ఈ కేసుపై అనేక కోణాల్లో చర్చ మొదలైంది. అసలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీం సూచించిన గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే. కోర్టే ఏం చేయబోతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసు దాఖలు నుంచి. ఇప్పటివరకు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి..

Published by HT Digital Content...