Hydarabad, Oct. 24 -- స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడం, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలాంటి వాటికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు నవంబర్ 3న హైకోర్టులో విచారణకు రానుంది. ఈ ప్రక్రియల ఫలితాల ఆధారంగా, ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీం కోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించింది. వచ్చే నెల 7వ తేదీన మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణ...