భారతదేశం, డిసెంబర్ 31 -- గ్రూప్‌-1 పరీక్షల ఫలితాలపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితరాలకు సంబంధించిన వివాదంపై జనవరి 22న తీర్పు వెలువరించనుంది. గతంలో సెలక్షన్‌ లిస్ట్‌ను రద్దు చేస్తూ సింగల్ బెంచ్ తీర్పునివ్వగా. డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇరువైపు వాదనలు పూర్తి కాగా. జనవరి 22వ తేదీన తుది తీర్పును ప్రకటించనుంది.

నిబంధనల మేరకే గ్రూప్‌-1 పరీక్ష జరిగిందని TGPSC తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పరీక్ష నిర్వహణ తప్పుల తడక జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులు కూడా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది.

అభ్యర్థుల...