భారతదేశం, జూన్ 16 -- ఫ్యాన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డు పడింది. రెబల్ మేనియాకు తెరలేచింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజాసాబ్ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ టీజర్ రిలీజైంది. సోమవారం (జూన్ 16) ఉదయం గ్రాండ్ ఈవెంట్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ టీజర్ రిలీజ్ చేశారు.

వరుసగా యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్నారు ప్రభాస్. కత్తులు, గన్లు, ఫైటింగ్.. ఇలాగే మాస్ యాక్షన్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు రాజాసాబ్ లో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉంది. డార్లింగ్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. చీకటి భవనంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. 'ఈ ఇల్లు నా దేహం. ఈ సంపద నా ప్రాణం. నా తదనాంతరం దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను' అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైం...