భారతదేశం, జనవరి 16 -- 2026లో స్కూటర్ కొనేవారికి 'ప్రాక్టికాలిటీ' అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. నగరాల్లో నిత్యం ప్రయాణించే వారికి హెల్మెట్లు, బ్యాగులు, కిరాణా సరుకులు వంటివి సర్దుకోవడానికి విశాలమైన బూట్ స్పేస్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత మార్కెట్​లో అందుబాటులో ఉన్న స్కూటర్లలో, అత్యధిక స్టోరేజ్ సామర్థ్యం కలిగిన టాప్-5 మోడళ్ల వివరాలు, వాటి ధరలు ఇక్కడ చూడండి..

రివర్ ఇండీ - 43 లీటర్లు: స్టోరేజ్ విషయంలో రివర్ ఇండీ ప్రస్తుతం భారత మార్కెట్​లో రారాజుగా వెలుగొందుతోంది. ఇందులో ఏకంగా 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉంది. ఇది చాలా లోతుగా, వెడల్పుగా ఉండటం వల్ల హెల్మెట్లతో పాటు పెద్ద వస్తువులను కూడా సులభంగా సర్దుకోవచ్చు. ప్రాక్టికాలిటీ కోరుకునే వారికి ఇదొక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ధర: రూ. 1,44,999 (ఎక్స్-షోరూమ్)

ఏ...