Hyderabad, జూన్ 16 -- కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన తెలుగు, తమిళ సినిమా కుబేర. తెలుగు పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

భారీ బడ్జెట్‌తో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కుబేర మూవీని నిర్మించారు. తాజాగా ఆదివారం (జూన్ 15) కుబేర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓం నమశ్శివాయ అంటూ ధనుష్ స్పీచ్ స్టార్ట్ చేశాడు.

హీరో ధనుష్ మాట్లాడుతూ.. "ఓం నమశ్శివాయ. అందరికీ నమస్కారం. ఏవీ చూస్తున్నప్పుడు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఈరోజు ఇక్కడ నేను ఉండటానికి కారణం ఆయన ...