Hyderabad, ఏప్రిల్ 19 -- పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో వండిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ పిల్లలు పాలకూర ఆహారాన్ని తినరు. దాని నుంచి వచ్చే పచ్చి వాసనా వారికి నచ్చదు. ఇలా పచ్చివాసన రాకుండా పాలకూర పచ్చడిని చేసి పెట్టారంటే ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఇలా పాలకూరను పచ్చడిగా చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు కూడా శరీరంలో పూర్తిగా చేరుతాయి. ఇంకెందుకు ఆలస్యం పాలకూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోండి.

పాలకూర - రెండు కట్టలు

నూనె - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

ఎండు మిర్చి - ఆరు

మెంతులు - పావు స్పూను

జీలకర్ర - అర స్పూను

ఆవాలు - అర స్పూను

మినపప్పు - ఒక స్పూను

చింతపండు - ఉసిరికాయ సైజులో

ధనియాలు - ఒక స్పూను

మినపప్పు - ఒక స్పూను

పచ్చి శెనగపప్పు - ఒక స్పూను

వెల్లుల...